Monday, September 28, 2009

బతుకమ్మ పండగ

హా..ఇప్పుడు ఈమె బతుకమ్మ పండగ విశిష్టత ని గురించి lecture ఇస్తుందేమో అని భయపడకండి...
జీవితం లో మొదటి సారి బతుకమ్మ పండగ కి వెళ్ళాలని అనిపించిన రోజు ఈ సంవత్సరం వచ్చింది దానితో ఒకేసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి ఈ బ్లాగ్ రాస్తున్నాను...
పండగ లో నచని ఒకే ఒక పండగ బతుకమ్మ పండగ..



నాకు గుర్తు వున్నా మొదటి బతుకమ్మ పండగ మా అమ్మమ్మ ఊర్లో జరిగిందీ...
అక్కడికి వెళ్ళడం అంటే , నాసా వాడు మార్స్ పైకి వెళ్ళినంత ఆనందం అండ్ అంతే రిస్క్ తో వున్నా పని కూడా
సెలవుల కి వెళ్లేముందు మా అన్నా మాకు పెట్టె టెస్ట్ ఎక్కాలు అప్పగించమనడం ....
అక్కడ బస్ కోసం వెయిటింగ్ అక్కడ బస్ దొరికితే వాదు నాసా వాడి రాకెట్ ఎక్కేముందు వుండె ఆనందం
అక్కడినుండి పాలకుర్తి కి ముక్కుతూ మూలుగుతూ వెళ్ళడం...అదృష్టం కొద్ది బస్ దొరికితే జనగామ లో దిగి అమ్మమ్మ వూరు బస్ కోసం వెయిటింగ్ అ లోపు న జుట్టు cutting, చందమామ పుస్తకం కొనిస్తే దానిని ఎవరు ముందు చదవాలో అని కొట్టుకోవడం..మా అన్నయ్య చదువుతుంటే వాడు నన్ను చదవనియ్యకపోవడం ...
అలా బస్ ముందుకు సాగుతుంటే వుండె ఎవేర్స్ట్ శికారం ఎక్కినంత ఆనందం వుండేది .

ఇంకా సెలవుల్లో కలిసే పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలు..వాళ్ళతో కలిసి బావి దగ్గరికి వెళ్లి స్నానాలు చేయడం...
పొద్దున్నే లేచి బుక్క సిద్దయ్య షాప్ కి పరిగేతి అటుకులు తెచుకుని చై లో వేసుకుని తినడం ...పక్కన వుండె శీను అన్నా తో తొక్కుడు బిళ్ళ ఆడడం ...శని వారం అది వారం సినిమా చూడడం కోసం వేరే వల్ల ఇంటికి వెళ్ళడం
ఇంక అప్పటి బతుకమ్మపండగ అంటేఅందరికన్నా పెద్ద బతుకమ్మ ని తీసుకెళ్లాలన్న నా కోరిక ఇంక కోరిక లాగానే మిగిలిపోయింది....మా పెద్దమ్మ చిన్నమ్మా పిల్లలు ఎక్కడినుంచో పూలు తెస్తే వాళ్ల బతుకమ్మ లని వెళ్లి చూసి కొన్ని పూలు అడుక్కొచి మరీ చేయమనే దాన్ని ఐన వాళ్ళ అంత పెద్ద బతుకమ్మ లని చేసేది కాదు మా అమ్మమ్మ .
ఇంక అక్కడికేల్లె ముందు మా అమ్మమ్మ చేసే పెసరపప్పు ప్రసాదం ఎపుడు తినాల అని వుండేది.
ముందు తింటే నోట్లో పుండ్లు అవుతాయ్ అని భయపెట్టేది..పండ్ల కన్నా ప్రసాదం తినకుండా వుండడమే బెటర్ అని దాని వాసన చూస్తూ వుండేదాన్ని.దాన్ని చివరిదాకా కాపాడే బాధ్యత నా నెత్తిమీద వేసుకుని నా ముందుకు సాగే దాన్ని

ఇంక అక్కడ అందరు గంటలు గంటలు ఆడడం ,ఆడడం అనడం కన్నా ముచట్లు పెట్టుకోవడం అంటేనే బెటర్ ఏమో...
ఇంక సాయంత్రం కాస్త చీకటి అయేసరికి కదలాలని అనిపించేదేమో...సూర్యుడు కి ఓపికే వుండి ఒకే ప్లేస్ లో 24 హర్స్ వుంటే వాళ్లు కదిలే వారు కాదు ...
ఇంక అక్కడి నుండి నిమజ్జనం చేయడం కోసం చెరువు దగ్గరికి వెళ్లి అది జరిగాక ప్రసాదం కోసం గోతి కాడ నక్కల్ల్లగా చూస్తున్న మాకు నిరాశ నిస్పృహ లు ఆవహించేవి ..
ఎందుకంటే మల్లి అందరు కలిసి ఒక గ్రూప్ సాంగ్ పాడే వాళ్లు ...
అప్పుడు ఓపెన్ అయ్యేది ప్రసాదం distribution...ఇంక అప్పటి నుండి అ పండగ అంటే ఎందుకో నచేది కాదు...

ఇంక అక్కడ కట్ చేస్తే మల్లి జనగామ లో ...
స్కూల్ లో వున్నా రోజులు ...౩నెలల(త్రైమాసిక ) పరీక్షలు వస్తున్నాయంటే ముందుగ సెలవుల గురించే ఆలోచించేదాన్ని..
పరీక్షలు అవుతుంటే ఎపుడు అయి పోతాయో అని వుండే ఆత్రం మాటల్లో చెప్పలేనిది ..అన్ని పరీక్షలకన్నా, సాంఘిక పరీక్ష రోజు వుండే ఆనందం అంతా ఇంతా కాదు..ఎపుడు objective పత్రం ఇస్తారో ఎపుడు multiple choice టిక్ చేసి ఇంటికి వస్తానో అని వుండేది...
రాగానే సెలవుల్లో చేసే పిండి వంటలూ అ ప్రోగ్రాం ప్రేపరే చేసే పిండి అబ్బోఒ...పెద్ద తతంగం .....ఇంట్లో బట్టలు వుతికే కర్ర ని బాట్ లాగ , న దగ్గర వున్నా బాతు బొమ్మ ని బాల్ లాగ ఆడే క్రికెట్ ...iన్ట్లో వాళ్లు తెచే కోత బట్టలు
తెచినంక నచలేదని అలగడము


చినపుడు బతుకమ్మ లని పట్టుకుని పోవడం ఆ రోజు నాకు నచని పట్టు డ్రెస్ వేసి తీసుకెళ్లాలని ,పట్టు వదలని విక్రమర్కురలిలాగా పట్టుదలతో వుండే మా అమ్మ నన్ను చాల సంవత్సరాలు హింస పెట్టింది.
అలాంటి గడ్డు సమయం లో నాకు సపోర్ట్ గ నిలిచేది మా నాన్న ఒక్కరే ...ఇంకా మా అన్నయ్య ల సంగితి చెప్పడానికేముంది ..నన్ను అలా తీసుకెళ్తూ వుంటే ఒకలాంటి రాక్షసానందం పొందే వాళ్లు .
అక్కడికి వెళ్ళాక అమ్మలక్క ల ముచట్లు..ఎవరు ఎ చీర కట్టుకున్నారు evaఋ ఎ నగలు వేసుకున్నారు అని చూడదినికి వస్తరెమొఅ ని అనిపించేది...
దీనికి తోడూ మా ఊరి కేబల్ నెట్వర్క్ వాదు వాచి వీడియో తీయడం పండగ హై లైట్ ...
ఎపుడు బతుకమ్మ లనితీస్తారో ఇంటికి వెళ్తామో అ ని వుండేది....
అలా చూసి చూసి విసిగి పాయిన నెను ఒక రోజు తెలివిగా మా అమ్మ తో ఒట్టు వేయించుకుని బతుకమ్మ పండగ కి దుమ్మ కొట్టడం ఆరంభించాను....అపుడు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు...ఆనందం తో పాటు తిట్లు అనే అక్షింతలు కూడా పడ్డవి....అ టార్చర్ కన్నా తిట్లే బెటర్ అనిపించేది...
ఇంక దసరా రోజు ముందు రోజు తీసిన వీడియో ని టెలికాస్ట్ చేయడం కేబుల్ వాడి ప్రత్యేకత....


పెళ్లి అయ్యాక ఇపుదు రెండవ బతుకమ్మ నాకు
కాని ఎపుడు లేని వింత కోరిక పుట్టింది బతుకమ్మ పండగ కి వెళ్లాలని...
ఈ సిటీ లో పెట్టట్లేదని నేను బాధపడ్డాను...
నా బాధ ఆ భగవంతుడు చూడలేక సరేలే...ఈ సంవత్సరం ఇక్కడ మొదటి సారి పండగ పెడుతున్నాము, మీరు మీ పాక ప్రావీణ్యాన్ని చూపెట్టడానికి వంటలు కూడా తీసుకు రావొచ్చు , ఉదయం ౧౧ నుండి ౬ గంటల వారకి కార్యక్రమం అని ఒక ప్రకటన online లో చూడగానే ప్రాణం లేచి వచ్చింది...
ఇంత ప్యార్ ఎందుకు వచ్చింది అని మీరు నన్ను అడిగితే దాని సమాధానం నా దగ్గర కూడా లేదు ,నాకూ ఇంత వారకి తెలియని ప్రశ్న లాగానే వుంది అది...
పండగ రోజు రానే వచ్చింది...

మార్నింగ్ 6 కళ్ళ లేచి రెడీ అయ్ 11 కల్లా అక్కడుండలి అనుకున్నా నేను లేచేసరికే 10 అయ్యింది వెంటనే లేచి రెడీ అవకుండా.. టీ తాగుతూ మా వారితో asusual గా college flashback లోకి వెళ్లి సినిమా స్టార్ట్ చేశాను
ఇంక అక్కడినుండి Minneapolis కి రావడానికి గంట పట్టింది
ఇంకా రెడీ అవుతుంటే మా ఫ్రెండ్ కాల్ చేసి బతుకమ్మని వెళ్లి చూసి రా next year చేదు వు లే అని నిరుత్సాహ పరిచింది . మా వారు కూడా వద్దు అనేసరికి ఇంక లాభం లేదు అని వదిలేసాను...
కాని sudden గ చంద్ర ముఖి సినిమా లో జ్యోతిక లాగ ఒకేసారి లేదు నెను బతుకమ్మ ని తీసుకెళ్తాను అని ఆవేశ పడ్డాను.
నా ఆవేశానికి మా వారు కూడా అడ్డుకట్ట వేయలేకపోయారు....
ఆవేశం కాస్త షాప్ కి వెళ్ళడానికి ఊతం ఇచ్చింది .
ఇండియా లో ఒకసారి కూడా వెళ్లలేదు ఇపుడు ఇక్కడ వెళ్ళడం ఏంటని ...వెంటనే ఇంట్లోకి వచ్చి రెడీ అయ్యాము..
అక్కడికి వెళ్లి జనాలని చూసే సరికి ఎందుకు వచము ర దేవుడా అని ఫీల్ అయి మొతానికి ఎంటర్ అయ్యాము
ఇంక అక్కడికెళ్ళి తిన్నాక ఆడడం స్టార్ట్ అయ్యింది...
ఇంక అలా స్టార్ట్ చేసిన ఆట ఆపాలని ఎవరు అనుకోకుండా కంటిన్యూ చేస్తూనే వున్నారు
అలా ఆడగా ఆడగా ఒక శుభ సమయాన అట నిఆపేశారు ..
నా జన్మ ధన్యం అయ్యింది అనుకున్నాను ..ఇంక మధ్యలో ఇండియా నుండి వచ్చిన ఒక ముసలామె ఆవేశపడి అక్కడున్న పెద్ద దిక్కు ఆమె కనుక మంగళ హారతులు అవి ఇవి పాడమని హింస పెట్టసాగింది..
ఇంక లాభం లేదనుకుని మేము మీరు పాడండి మేము వింటాము..మాకు పుణ్యం వస్తుంది అని ఒక పుణ్యాత్మురాలు సలహా పడేసింది...
ఎట్టకేలకు అక్కడి నుండి నిమజ్జనం జరిగాక ..ప్రైజ్ distribution చేపట్టారు..బతుకమ్మ చేసిన అందరికి ఒక ఫ్లవర్ వస్ ఇచేసరికి...నా ప్రైజ్ మిస్ అయ్యిందే అని ఫీల్ అయ్యాను.నా ఫీలింగ్ ని చూడలేక మా వారు నన్ను ఓదార్చారు..
ఇంక అలా మేము అక్కడ అలాగా పండగ ముగిసాక ఇంటికి తిరిగి వచ్చాము.

No comments:

Post a Comment