Saturday, October 3, 2009

కళ్లు కాయలు, పండ్లు .....

కళ్లు కాయలు కాసే లాగ ఎదురుచూడడం అంటే ఏమిటో నాకు ఇపుడు ప్రత్యక్షంగా తెలుస్తుంది...
కాయలు అనేకన్నాపండ్లు ...బాగా పండిన పండులు అంటే బెటర్ ఏమో...
మేటర్ లోకి వెళ్తే
బాధపడకండి ...మల్లి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి చిన్నపుడు సినిమా వేస్తుందేమో అని .. ఈమెకి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళడానికి tortoise తిప్పే మనిషి ఎవరో అని ,ఎన్ని tortoise డబ్బాలు కొని పెట్టిందో ఫ్లాష్ బ్యాక్ రీల్ తిప్పడానికి అని ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోకండి ..నాకు తెలుసు బ్లాగ్ చదువుతున్న మీరు seat లోంచి లేచి వెళ్లి సుత్తి తీసుకురావడానికి బద్ధకం అని ....
పక్కాగా ఇపుడు విషయం లోకి వెళ్తాను...ఇది నా అభయ హస్తం...
నా బ్లాగ్ చదివిన కొందరు శ్రేయోభిలాషులు బాగుంది అని అంటే చెవిలో పువ్వు fruits గట్రా పెడుతున్నారు అనుకున్నా...
కాని అందరు అలానే అనేసారికి(ఏదో నేను ఫీల్ అవుతానని కూడా చెప్పి వుంటారు ) ఏదో ఒకటి...లే..కాంప్లిమెంట్ రావడమే ఆలస్యం... కిరానా షాప్ దగ్గర 9 కిలోల కంది పప్పు కొంటె అగ్గిపుల్ల ఉచితం అనే ప్రకటన చూసి పొంగిపోయిన అమ్మలక్క లాగ ఒక్కసారి మల్లి నేను నా 70MM dreams లోకి వెళ్లాను ..ఈసారి మన మెగాస్టార్ సినిమా ....
ఆపద్బాంధవుడు సినిమా లో చిరంజీవి ని చెట్టు పైకి క్రేన్ తో తీసుకెళ్తే నేను మాత్రం ..
అందరు పొగిడేసరికి నేను ఏకంగా everest పైకే వెళ్ళింది నా క్రేన్ ....వెళ్ళాను కాని కిందికి చూస్తే కళ్లు తిరిగాయి నాకు...అంత ఎత్తు నుండి భూమి ని చూసినందుకు కాదు ...సింక్ నిండా వున్నా గిన్నెలు నన్నేగుడ్లు వురిమి చూస్తున్నాయి తోమేది వుందా లేదా అని ...
మల్లి కిందికిరావడం తోమడం ఇపుడు రాయడం ...
సరే విషయానికి వస్తున్న ..
ఇంక నీ బ్లాగ్ కి కామెంట్స్ ఎలా రాయాలి అని అడిగితే అప్పటిదాకా సెట్టింగ్స్ లో ఆఫ్ లో కామెంట్స్ ని ఆన్ చేశాను ఎంతో ఆశ తో...
కానీ నా ఆశ మురిగిపోయిన ఆవకాయ అవుతుంది అని అప్పుడు అనుకోలేదు...
ఇంక అది మొదలు టీవీ 9 న్యూస్ రీడర్ అరగంటకి ఒకసారి repeat చేసే పాత వార్త ల్లాగా నా బ్లాగ్ ఓపెన్ చేసి కామెంట్స్ అనే caption పక్కన సంఖ్య పెరుగుతుంది ఏమో అని ఆత్రం అంటారు కదా దానిని infiniti తో గుణిస్తే ఎంత వస్తుందో ...(ఇపడు అంత ఓపిక లేదు లెక్క పెట్టడాని కి 1-9 కన్నా పెద్దగ వుంది కదా రాయడానికి అని రాసాను) ఇపుడు లెక్క వేసుకోండి మీరే దానితో... అంతటి ఆత్రం తో చూస్తే అందులో వుండే కామెంట్ మా ఫ్రెండ్ పంపిన తొక్కలో హాయ్ అని నేను బ్లాగ్ create చేసినపుడు పంపించిన కామెంట్...
దాని ని చూసినప్పుడల్లా మొన్నటి దాక మా ఫ్రెండ్ ని ఊహలో ఎగిరి తన్నేదాన్ని.. ఇప్పుడు దానిని తన్నితే తన్ను కే సిగ్గేస్తదేమో అనిపించేంత అసహనం బాధ ఆక్రోశం ఆవేదన అధ్యక్షా....
ఇంతటి ఆవేదన లో నూ ఆవగింజ ని 100 ముక్కలు చేస్తే అందులో ఒక గింజ అంత ఆశ నన్ను ఇంకో అడుగు వేయించింది ...
ఎవరైనా నా బ్లాగ్ చదివి కామెంట్స్ రాసారని తెలిస్తే , బయట జనాలు రాళ్ళతో కొడతారని భయపడి పర్సనల్ గా నన్ను బ్లాగ్ రాయొద్దు అని వెడుకున్నారేమో అని sign in అయి బొద్దింక తో మళ్లీ ..కళ్లు కాయలు పండ్లతో, బాగా మగ్గిన పండ్ల తో ఎదురు చూసాను...
నన్ను ఆలా వేడుకోవడానికి కూడా కీ బోర్డ్ సహకరించలేదేమో....
situation తగ్గట్టు "ఆశే నిరాశేనా బతుకంతా ఇంతేనా " ...అనే పాట అయిపోయి "నిదురపోరా తమ్ముడా" అనే పాట ప్లే అవుతుంది ..laptop లో ఇక్కడ తమ్ముడు ఎవరు లేరు కదా ఓహ్ ..రాసింది చాలు నన్నే పడుకో అంటున్నారేమో అని పడుకుంటున్నాను....