Thursday, September 24, 2009

గుండె నొప్పి

గుండెనొప్పి టైటిల్ వినగానే నాకేదో నిజంగానే heartpatient అనుకునేరు అంత లేదు మనకి ....
అనుకోకుండా నాకు ఒక రోజు గుండె నొప్పి వచ్చినట్టు అయ్యింది
మామూలుగానే తెలుగు సినిమాల ప్రభావం విపరీతం గా వున్నా అ వయసులో...సినిమా లో చివరి దశ లో వున్నా హీరోయిన్ లాగా చచ్చిపోయే లోగ కోరికలు ఏమైనా మిగిలి వున్నాయా అని ఆలోచించాను...అప్పటికి shah rukh khan ని లైవ్ లో చూడాలని వుండే కోరిక తప్ప ఏమి లేదు ...
అ ఆకోరిక కోరిక లాగానే మిగిలివుంటుందని అప్పటికి ఇంక తెలియని తెలుగు సినిమాలో శ్రీలక్ష్మి మనస్తత్వం.
ఇంక వెంటనే నాకు గుండె నొప్పి అంటే ఎలాగు మా అమ్మ నమ్మదని నాకు అర్ధం అయింది...అప్పటికే ఇంక నా గుబులు ఏమిటంటే ఈ చావు నన్ను ,ఆ రాత్రి మా అమ్మ కిచెన్ లో చేసే చికెన్ ని నన్నువేరు చేస్తుందని ఒక బెంగ తో ...ఎలాగైనా సరే చికెన్ ఆస్వాదిస్తూ తినాలనే పిచ్చి లో ఇంక బతకాలని ప్రేరేపించింది..
వెంటనే మా చిన్న అన్నయ్య తో నా గుండె నొప్పి విషయం చెప్పను వెంటనే మా అన్నయ్య తెలుగు సినిమాలో శోభన్ బాబు లాగ విపరీతం గా స్పందించి వాయువేగం తో నన్ను మా ఫ్యామిలీ అనాలో మా ఊరి డాక్టర్ అనాలో శ్రీహరి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు...
అ టైం లో కూడా నవ్వొచిన విషయం ...
ఎందుకంటే అప్పటికే నాకు ఫ్యామిలీ & టౌన్ డాక్టర్ దగ్గరికి వైద్య సహాయమ కోసం తీసుకున్న దాంట్లో నేను ఒకదాన్ని కాబట్టి...
వెంటనే ఫ్లాష్ బ్యాక్ gurthochhi navvukunnanu ....
నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఎప్పుడు వెళ్ళినా ఒకే ఆర్డర్ లో తను చేసే చికిత్స ని చూసి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి....
మనకి జ్వరం వచ్చినా కాళ్ళ నొప్పి , కళ్ళ నొప్పి ఐన...వెంటనే వెళ్ళగానే stethoscope తీయడం... ఆ తర్వాతా మందులు రాయడం... ఆయనకి డబ్బులు ఇవ్వడం ఇలా సాగేది.
మళ్లీ ఇపుడు story లోకి వద్దాము ..
అలా వాయు వేగం తో దూసుకు పోతున్న మేము వెంటనే డాక్టర్ క్లినిక్ ని చేరుకున్నాము
అసలే విపరీతమైన గుండె నొప్పి తో వున్నా నేను మరియు చెల్లి కి ఏమవుతుందో అని టెన్షన్ గా వున్నా మా అన్నయ్య, నేను ... ఆ డాక్టర్ ని కలిసాము
వెంటనే మా మా చెల్లి కి గుండె లో నొప్పి అని చెప్పాడు..నింపాదిగా షరామాములుగానే మా డాక్టర్ స్తేత స్కోప్ తీసాడు...వెంటనేనకు నవ్వొచింది ...అపుడు గుండ ఎనొప్పి వుందన్న ఎఫ్ఫెచ్త్ కనపడడానికి అని నవ్వు ఆపుకోవాల్సి వచ్చింది ...
తన మార్క్ dialogues తో మందులు రాయడం.. మేము వాటిని తెచ్చుకోవడం రెండు జరిగిపోయి
వెంటనే ఇంటికి తిరిగి వచ్చిన నేను మా అమ్మ తో ..."అమ్మ నాకు గుండె నొప్పి... నాకు ఎలాగో అవుతుంది
నేను ఇంక బతకను" అని భారీ dialogues చెప్తున్న నాకు, మా అమ్మ నుండి అన్తకుమున్దు లేని సానుభూతి లభించేసరికి కొంచెం కుదుట పడ్డాను.
వెంటనే మా అమ్మ కన్నాంబ level లో చనిపోయే కూతురికి ఇష్టమైన చికెన్ ,అన్నం కలిపి తినిపించేసరికి...
ఒంట్లో 1000 volts ప్రవిహించినట్టయింది..
అపుడు కడుపు నిండా అన్నం తిన్న నేను వెంటనే నేను ఫాం లోకి వచ్చిన రజిని లాగ రెచ్చిపోయేసరికి అందరికి అప్పుడు అర్ధం అయ్యింది ....
నేను ఆకలి తో గుండె నొప్పి అని వాళ్ళని చావగొట్టానని..

1 comment:

  1. Very good literature..and good vocabulary...Idhi patrikalaku pampina pysalu vasthayi..:)----By father.

    ReplyDelete